నాని వదిలిన ‘మసూద’ టీజర్‌

ABN , First Publish Date - 2022-08-03T06:05:25+05:30 IST

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ వంటి చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్న స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రం ‘మసూద’....

నాని వదిలిన ‘మసూద’ టీజర్‌

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ వంటి చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్న స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రం ‘మసూద’. హారర్‌ డ్రామా జానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో సాయికిరణ్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా. ‘జార్జిరెడ్డి ’చిత్రంలో లల్లన్‌సింగ్‌ పాత్రను పోషించిన తిరువీర్‌ హీరోగా, ‘గంగోత్రి’ చిత్రంలో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతుందన్నారు. సీనియర్‌ నటి సంగీత కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌ విడుదల చేసిన అనంతరం నాని మాట్లాడుతూ ‘ సినిమాను ఎప్పడెప్పుడు చూద్దామా అనిపించేలా టీజర్‌ ఉంది. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేషన్‌తో వర్క్‌ చేసినట్లు అర్ధమవుతోంది. అందరికీ అభినందనలు’ అన్నారు. నిర్మాత రాహుల్‌ నక్కా మాట్లాడుతూ ‘మా సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం ఇది. అందరినీ అలరించేలా దర్శకుడు సాయికిరణ్‌ రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. 


Updated Date - 2022-08-03T06:05:25+05:30 IST