Tarun Bhaskar: ‘నాలుగు ఫ్లాపులొచ్చాక విజయ్‌తో సినిమా చేస్తా’..

Twitter IconWatsapp IconFacebook Icon
Tarun Bhaskar: నాలుగు ఫ్లాపులొచ్చాక విజయ్‌తో సినిమా చేస్తా..

‘నాలుగు ఫ్లాపులొచ్చాక విజయ్‌తో సినిమా చేస్తా’..అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). టాలీవుడ్ రౌడీ హీరోగా ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ (Pelli Choopulu). తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. చాలా తక్కువ బడ్జెట్‌తో ‘పెళ్లి చూపులు’ నేపథ్యంలో తెరక్కిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. 

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘ద్వారక’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు చేసి స్టార్‌గా మారాడు. ఇక తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాను తీసి ప్రశంసలు అందుకున్నాడు. ప్రముఖ ఓటీటీఒ నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన ‘పిట్టకథలు’ వెబ్ సిరీస్ కూడా ఈ యంగ్ డైరెక్టర్‌కు మంచి పేరే తెచ్చిపెట్టింది. నటుడిగానూ మంచి పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్న తరుణ్ భాస్కర్ త్వరలో వెంకటేశ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో జరిగిన సంఘటనల గురించి..అలాగే, మళ్ళీ విజయ్ దేవరకొండతో సినిమా ఎప్పుడు చేస్తారు..? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘విజయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివాడు. నాలుగు ఫ్లాపులొచ్చాక గానీ తనతో చేస్తా’.. అని సమాధానమిచ్చాడు. అయితే, ఆ ఫ్లాపులు ఎవరికీ అని అడగగానే తనకే అని చెప్పాడు. అంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనకి విజయ్ తప్పకుండా సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడనే నమ్మకాన్ని తెలిపాడు. ఇక ‘పెళ్లి చూపులు’ షుటింగ్ సమయంలో ట్రక్‌కి బ్రేకులు ఫేయిల్ అందరం కంగారు పడుతుంటే తను మాత్రం చాలా రిలాక్స్డ్‌గా కూర్చున్నాడు..అలా ఎలా ఉండగలిగావు..అని అడిగితే..‘ఏముంది అందరం కలిసి చచ్చిపోతాము కదా’.. అని అన్నాడు..అంటూ మెమరీస్‌ను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.