మలయాళ నటికి BOLLYWOOD BEAUTY మద్దతు

తెలుగులోనూ నటించిన మలయాళ నటి భావనా మెనన్‌కి బాలీవుడ్ నుంచీ మద్దతు లభిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ ఆమెపై లైంగిక దాడి చేయించాడన్న వార్త అప్పట్లో పెను దుమారం రేపింది. అయితే, అదే కేసులో ఈ మధ్య భావనా పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె తన సొషల్ మీడియా అకౌంట్లో ఆనాటి సంఘటనపై తాజాగా మరికొన్ని కామెంట్స్ చేసింది. దాంతో ఆమెకి బాలీవుడ్ నుంచీ కూడా మద్దతు పెరుగుతోంది. దర్శకురాలు జోయా అఖ్తర్ తరువాత ఇప్పుడు తనూశ్రీ దత్తా సపోర్ట్ చేసింది... 


భావనా మెనన్ మనో ధైర్యాన్ని తాను గొప్పగా భావిస్తానంటోంది తనూశ్రీ. దారుణమైన సంఘటన జరిగిన తరువాత కూడా భావనా మానసికంగా కృంగిపోలేదని, వెంటనే వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నిలదొక్కుకుందని వ్యాఖ్యానించింది. అంతే కాదు, తనూశ్రీ తన గతాన్ని సైతం జ్ఞాపకం చేసుకుంది. ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆమెని నానా పటేకర్ లైంగికంగా వేధించాడని అప్పట్లో ఆరోపించింది. తాజాగా యాంగ్జైటీ, డిప్రెషన్‌తో అప్పట్లో తానెలా బాధపడింది వివరించింది. నటి భావనకు మద్దతు తెలిపే క్రమంలో నానా పటేకర్ ఉదంతాన్ని కూడా తనూ చర్చించింది. ఆ కేసు విషయంలో ప్రధాన సాక్షులందర్నీ బెదిరించి మాట్లాడకుండా చేసేశారనీ చెప్పింది. తన కేసు ఆ విధంగా కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోయిందని వాపోయింది. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.