Kollywood : హీరో పార్తీబన్‌ను అభినందించిన తమిళనాడు సియం

ABN , First Publish Date - 2022-08-03T19:36:48+05:30 IST

కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన వైవిధ్యమైన చిత్రం ‘ఇరవిన్ నిళల్’ (రాత్రి నీడ). ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు పార్తీబన్ ఈ సినిమాను తెరకెక్కించారు. బయోస్కోప్ ఫిల్మ్ ఫ్రేమర్స్, అకిరా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంది.

Kollywood : హీరో పార్తీబన్‌ను అభినందించిన తమిళనాడు సియం

కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన వైవిధ్యమైన చిత్రం ‘ఇరవిన్ నిళల్’ (Iravin Nizhal) (రాత్రి నీడ). ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు పార్తీబన్ (Parthiban) ఈ సినిమాను తెరకెక్కించారు. బయోస్కోప్ ఫిల్మ్ ఫ్రేమర్స్, అకిరా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, రోబో శంకర్, బ్రిగిడా సాగా, ఆనంద కృష్ణన్, సాయిప్రియాంకా రుత్, స్నేహా కుమార్, రేఖా నాయర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రహమాన్ (AR Rahaman) సంగీతం అందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలోనే సింగిల్ షాట్‌లో చిత్రీకరించిన నాన్ లీనియర్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై కోలీవుడ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. 


అలాంటి ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్‌లో సీఎం సోమవారం రాత్రి తిలకించారు. చిత్రాన్ని చూసిన అనంతరం దర్శక, నిర్మాత, హీరో ఆర్‌.పార్తిబన్‌తో పాటు చిత్రంలోని ప్రధాన టెక్నీషియన్లను ఆయన అభినందించారు. ‘ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్తిబన్‌ను పలు విధాలుగా ప్రశించిన సీఎం... ‘ఇరవిన్‌ నిళల్‌’ మూవీ గురించి ఒకే ముక్కలో చెప్పాలంటే ‘అద్భుతం’ అంటూ వీవీఐపీ సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆ తర్వాత చిత్ర బృందాన్ని కూడా ఆయన అభినందించారు. ఇదిలావుండగా ఈ చిత్రం విడుదలై నాలుగువారాలైనప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. మరోవైపు ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఏడు అవార్డులు వచ్చాయి. అలాగే, చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ యూనిట్‌ సభ్యులను అభినందింస్తూ, ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 

Updated Date - 2022-08-03T19:36:48+05:30 IST