బాడీ షేమింగ్‌ బాధ కలిగిస్తుంది: తమిళిసై

ABN , First Publish Date - 2022-01-29T20:52:38+05:30 IST

‘శ్యామ్‌సింగారాయ్‌’లో దేవదాసిగా నటించిన సాయిపల్లవిపై ట్రోల్స్‌, రకరకాల మీమ్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే! అందులో రోజీగా నటించిన సాయి పల్లవిని చాలామంది అభినందించారు. దేవదాసిగా ఆమె నటన, డాన్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం సాయి పల్లవి పాత్రను విమర్శించారు. బాడీ షేమింగ్‌ చేస్తూ ట్రోల్‌ చేశారు. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు.

బాడీ షేమింగ్‌ బాధ కలిగిస్తుంది: తమిళిసై

‘శ్యామ్‌సింగారాయ్‌’లో దేవదాసిగా నటించిన సాయిపల్లవిపై ట్రోల్స్‌, రకరకాల మీమ్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే! అందులో రోజీగా నటించిన సాయి పల్లవిని చాలామంది అభినందించారు. దేవదాసిగా ఆమె నటన, డాన్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం సాయి పల్లవి పాత్రను విమర్శించారు. బాడీ షేమింగ్‌ చేస్తూ ట్రోల్‌ చేశారు. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఎన్నో సందర్భాల్లో బాడీ షేమింగ్‌కు గురైన ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘గతంలో నన్ను కూడా ఇలా ఎంతోమంది ట్రోల్‌ చేశారు. రకరకాల మాటలు అన్నారు. ఆ కామెంట్లు ఎంతగా బాధ కలిగిస్తాయో అనుభవించిన వారికే అర్థమవుతుంది. అలా నేను బాధ పడిన సందర్భాలెన్నో. నా ప్రతిభతో అన్నింటినీ దాటుకొచ్చా. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రభావితం కాకుండా ఉండటానికి మనం మహాత్ములం కాదు. ఆ కామెంట్లు బాధ కలిగించాయా అంటే కచ్చితంగా నొప్పించాయనే చెప్పాలి. విస్మరించుకుంటూ ముందుకెళ్లాను. పొట్టిగా, రంగు తక్కువతో పుట్టడం మన తప్పు కాదు. ప్రతి దానిలో అందం ఉంటుంది. సామెత చెప్పినట్లు ‘కోడి పిల్ల రంగు ఏదైనప్పటికీ తల్లి కోడికి అది బంగారు పిల్లగానే కనిపిస్తుంది. పిల్ల రంగు తక్కువ ఉందని తన బిడ్డని తిరస్కరించదు. ముఖ్యంగా స్ర్తీలే బాడీ షేమింగ్‌కు గురవుతున్నారు. 50 ఏళ్లు ఉన్న పురుషులు ఇప్పటికీ యువకులుగా పరిగణించబడుతున్నారు. మహిళలు మాత్రం వయో వివక్షత ఎదుర్కొంటున్నారు’’ అని  తమిళిసై అన్నారు. 


Updated Date - 2022-01-29T20:52:38+05:30 IST