Vijay Sethupathi పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..? దుబాయిలో‌ ఉండగానే ఆన్‌లైన్లో స్నేహం.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-12-08T22:13:21+05:30 IST

‘ఉప్పెన’ సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆ మూవీ తర్వాత ఆయన తెలుగులోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు.

Vijay Sethupathi పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..? దుబాయిలో‌ ఉండగానే ఆన్‌లైన్లో స్నేహం.. ఆ తర్వాత..

‘ఉప్పెన’ సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆ మూవీ తర్వాత ఆయన తెలుగులోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఈ సూపర్‌స్టార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే 23 ఏళ్ల చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు. అయితే తను సినిమా ఇండస్ర్టీలో మంచి స్థాయిలో ఉండడానికి కారణం తన భార్యనని ఓ సందర్భంలో చెప్పాడు.


రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు జెస్సీతో పరిచయం అయ్యింది. అప్పుడు ఆమె కూడా అక్కడే ఉంది. అయితే మేము ఒకరినొకరు చూడకుండానే చాటింగ్ ద్వారా స్నేహితులమయ్యాం. అలా మేము క్లోజ్ అయ్యామ’ని చెప్పాడు.


అయితే, ఈ జంట బంధం గురించి తెలియజేసినప్పుడు వారి కుటుంబాలు సంతోషించలేదు. చాలాసార్లు మాట్లాడిన తర్వాత, వారి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. అయితే జెస్సీ, ఆయన ఒకరినొకరు చూసుకుంది వారి ఎంగేజ్‌మెంట్‌లోనే అని సేతుపతి తెలిపాడు. భార్య పోత్సహంతోనే మూవీస్‌లో ఈ స్థాయికి చేరుకోగలిగాడని చెప్పాడు.

Updated Date - 2021-12-08T22:13:21+05:30 IST