Canes Festival: రెడ్‌ కార్పెట్‌పై తారల సందడి!

ABN , First Publish Date - 2022-05-19T22:24:46+05:30 IST

అంతర్జాతీయ సినీ రంగంలో అత్యంత గర్వంగా చెప్పుకొనే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ఈ నెల 17న ప్రారంభమైన సంగతి తెలిసిందే! ఈ నెల 28వ తేది వరకూ జరిగే 75వ కేన్స్‌ ఉత్సవాల్లో రెడ్‌ కార్పెట్‌పై తారలు హోయలు ఒలకబోస్తూ సందడి చేస్తున్నారు.

Canes Festival: రెడ్‌ కార్పెట్‌పై తారల సందడి!

అంతర్జాతీయ సినీ రంగంలో అత్యంత గర్వంగా చెప్పుకొనే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌(Canes Film Festivals) ఈ నెల 17న ప్రారంభమైన సంగతి తెలిసిందే! ఈ నెల 28వ తేది వరకూ జరిగే 75వ కేన్స్‌ ఉత్సవాల్లో రెడ్‌ కార్పెట్‌పై తారలు హోయలు ఒలకబోస్తూ సందడి చేస్తున్నారు. కొన్నేళ్లగా కేన్స్‌ (Canes)ఎర్ర తివాచీపై హంసనడకలతో అలరిస్తూ ‘క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌’గా గుర్తింపు పొందిన ఐశ్వర్యారాయ్‌(aishwarya rai) ఈ ఏడాది వేడుకల్లో కూడా అదరహో అనిపించారు. కేన్స్‌ ఉత్సవాలు మొదలైన మొదటి రోజు తమన్నా, ఊర్వశి రౌతెలా(Urvasi routhela) రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. రెండో రోజు ఐశ్వర్యరాయ్‌, పూజాహెగ్డే (Pooja hegde)వేదికపై అలరించారు. నల్ల గౌన్‌ వేసుకుని రెడ్‌ కార్పెట్‌పై సింపుల్‌గా దర్శనమిచ్చిన ఐశ్వర్యను చూసి వీక్షకులు ఫిదా అయిపోయారు. ఆ ఫొటోలు బయటకు రాగానే ప్యాషన్‌ ప్రియులు మురిసిపోయారు. ‘కేన్స్‌కి ఐశ్వర్య దేవత’, ‘కేన్స్‌ క్వీన్‌’, ‘ఐష్‌ ఈజ్‌ సో బ్యూటీఫుల్‌’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తమన్నా, పూజా హెగ్డే కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొవడం ఇదే మొదటిసారి. 






Updated Date - 2022-05-19T22:24:46+05:30 IST