రజనీతో తమన్నా?
ABN , First Publish Date - 2022-08-17T07:11:18+05:30 IST
తమన్నాకు ఓ సూపర్ ఛాన్స్ దక్కిందా? త్వరలోనే రజనీకాంత్ సరసన ఆమె నటించనున్నారా? ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు...
తమన్నాకు ఓ సూపర్ ఛాన్స్ దక్కిందా? త్వరలోనే రజనీకాంత్ సరసన ఆమె నటించనున్నారా? ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ కథానాయకుడిగా ‘జైలర్’ అనే చిత్రం రూపుదిద్దుకొంటోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నాని కథానాయికగా ఎంచుకొనే అవకాశాలు ఉన్నట్టు టాక్. ప్రస్తుతం చిత్రబృందం తమన్నాతో సంప్రదింపులు జరుపుతోందని, తమన్నా కూడా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘జైలర్’ కోసం నయనతార, త్రిషలాంటి కథానాయికల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి తమన్నా అయితే బాగుంటుందని నెల్సన్ భావించారట. రజనీ, తమన్నా కలిసి నటించడం ఇదే తొలిసారి. అదే నిజమైతే తమన్నా కెరీర్‌కి ఇది మరో కీలకమైన మలుపు అవుతుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు తమన్నా. ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. ఆమె నటించి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధమైంది.