Tamannaah: నాకు అలా తినడం రాదు.. అందుకే అలాంటి చోటికి వెళ్లను

ABN , First Publish Date - 2022-09-23T15:55:05+05:30 IST

బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న సౌతిండియా నటీమణుల్లో తమన్నా భాటియా ఒకరు. సౌతిండియాలో

Tamannaah: నాకు అలా తినడం రాదు.. అందుకే అలాంటి చోటికి వెళ్లను

బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న సౌతిండియా నటీమణుల్లో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకరు. సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టినప్పటికీ అక్కడ సరైన గుర్తింపు సాధించలేకపోయింది. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ మంచి కెరీర్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ తరుణంలో తమన్నా చేసిన హిందీ చిత్రం ‘బబ్లీ బౌన్సర్’(Babli Bouncer).


ఈ మూవీ సెప్టెంబర్ 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌(Disney Plus Hotstar)లో విడుదలైంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌తో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో హోస్ట్ ఈ బ్యూటీ చేసిన ఫ్యాన్సీ డిన్నర్ డేట్ గురించి అడిగాడు. దానికి సమాధానంగా తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఫ్యాన్సీ డేట్స్ చేయలేను. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కనీసం అలాంటి ప్లేస్‌లో ఉండాలన్న చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నేను ఎప్పుడు నా చేతులతో తింటాను. అందుకే కత్తి, ఫోర్క్ పట్టుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాను. అది నాలో ఒత్తిడిని పెంచుతుంది’ అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అయితే.. తన అభిప్రాయాలు కలిసే వ్యక్తితో బయటికి వెళ్లడానికి అంతగా ఇబ్బందిపడనని తెలిపింది. అంతేకాకుండా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అది నిర్మాత, దర్శకుడి నిర్ణయం అని చెప్పుకొచ్చింది.


కాగా.. బాలీవుడ్ టాప్ దర్శకుడు మధుర్ భండార్కర్ ‘బబ్లీ బౌన్సర్’కి దర్శకత్వం వహించాడు. మగరాయుడిలా తిరిగే ఓ పల్లెటూరి యువతికి ఓ పబ్‌లో లేడీ బౌన్సర్‌గా ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - 2022-09-23T15:55:05+05:30 IST