Ghani : తమన్నా ఐటెమ్ సాంగ్ వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2022-01-12T21:11:08+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. బాక్సర్ గా వరుణ్ తేజ నటిస్తుండగా.. అతడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ మెప్పించబోతోంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాకి నిర్మాత. ఈ డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ‘గని’ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉన్న కారణంగా సినిమాకి కొత్త విడుదల తేదీని ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. ఇంతకు ముందు విడుదలైన గని సింగిల్స్, టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ghani : తమన్నా ఐటెమ్ సాంగ్ వచ్చేస్తోంది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. బాక్సర్ గా వరుణ్ తేజ నటిస్తుండగా.. అతడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ మెప్పించబోతోంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాకి నిర్మాత. ఈ డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ‘గని’ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉన్న కారణంగా సినిమాకి కొత్త విడుదల తేదీని ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. ఇంతకు ముందు విడుదలైన గని సింగిల్స్, టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక  ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా తమన్నాపై ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించారు.


సంక్రాంతి రోజున అంటే ఈ నెల 15న ఈ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ‘కొడితే’.. అంటూ సాగే ఈ పాటకు తమన్నా మెరుపు మూమెంట్స్ హైలైట్ కాబోతున్నాయి. ఇంతకు ముందు పలు చిత్రాల్లో ఇదే తరహాలో ప్రత్యేక గీతాల్లో తమన్నా నర్తించిన సంగతి తెలిసిందే. మరి ‘గని’ చిత్రానికి తమ్మూ స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.  



Updated Date - 2022-01-12T21:11:08+05:30 IST