కె.జి.యఫ్ చాప్టర్1 బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఆ సినిమాలో రాకీభాయ్ పాత్రలో రాక్ చేసిన హీరో యష్ పాన్ ఇండియా హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కె.జి.యఫ్ చాప్టర్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత యష్ ఏ సినిమా చేస్తాడనే దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే నర్తన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. కాగా.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో యష్ జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాహుబలి తర్వాత తమన్నా నటిస్తోన్న మరో భారీ ప్రాజెక్ట్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.