ఇక్కడ ప్రతిభే ముఖ్యం

ABN , First Publish Date - 2022-05-22T05:43:25+05:30 IST

అతియాశెట్టి... బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కూతురు. ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక్కడ ప్రతిభే ముఖ్యం

తియాశెట్టి... బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కూతురు. ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకట్రెండు సినిమాలు తీసినా అవి పెద్దగా విజయం సాధించలేదు. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అతియా ‘స్టార్డమ్‌ అనేది ఊరికే రాదు. ప్రతిభ, అదృష్టమూ ఉండాలి’ అంటోంది ఈ బ్యూటీ.

‘‘నాన్నగారి షూటింగ్స్‌ సెట్స్‌కు చాలా తక్కువ వెళ్లేదాన్ని. మా అన్నయ్య అహాన్‌ కూడా అంతే. నేను మాత్రం పక్కా ఫిల్మీ గాళ్‌నే. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘కల్‌ హో న హో’, ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ చిత్రాలు చూశాక ..ఆ  హీరోయిన్ల కళ్లద్దాలు పెట్టుకుని హీరోయిన్‌లా డైలాగ్స్‌ చెప్పి.. అమ్మను తెగ విసిగించేదాన్ని. 


న్యూయార్క్‌లో ఫిల్మ్‌ కోర్సు చేశా.. 

నేను స్కూల్‌లో మంచి విద్యార్థినే. ‘అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ బాంబే’లో చదివా. అక్కడ ఎన్నారైలు, విదేశీపిల్లలు చదివేవారు. ప్రత్యేకంగా చూసేవారు కాదు. డ్రామాల్లో నటించడానికి తెగ ఇష్టపడేదాన్ని. నటనలో, డ్యాన్సులో ఎప్పుడూ అందరికంటే ఒకడుగు ముందే. సినిమా ఆసక్తి కాబట్టి ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’ లో చదివా. 


అలా సినిమా అవకాశం..

ఓ రోజు సాయంత్రం జిమ్‌ చేస్తుంటే సల్మాన్‌ఖాన్‌ చెల్లెలు అల్విరా చూసింది. ‘సినిమాల్లో నటిస్తావా?’ అనడిగింది. ఆమె రిఫర్‌ చేసిన చిత్రమే ‘హీరో’. అది సల్మాన్‌ఖాన్‌ ప్రొడక్షన్‌. వెంటనే సైన్‌ చేశా.


నాన్న కూచిని..

 నా బ్యాక్‌బోన్‌ అమ్మే నాన్నకూచిని. నాన్న సినిమాలు చూడను. దానికో కారణముంది. ఒకరోజు అందరం సినిమా చూస్తున్నాం. ఒక సన్నివేశంలో నాన్నను కాల్చేస్తారు. అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా. బిగ్గరగా అరిచి ఏడ్చాను. నాన్న దగ్గరికొచ్చి ఓదార్చారు. అయినా ఏడుపు ఆపలేదు. కాల్చిన వాడిని చంపేస్తానన్నా. ‘అది సినిమా’ అన్నారు నాన్న. ఆ సినిమా ‘హేరా పేరీ’. ఆ సంఘటన తర్వాత నాన్న నటించిన చిత్రాలు చూడటం మానేశా. 


అదే నా ఆశ..

‘శుక్రవారం రోజు మన ముఖం ఎప్పుడూ హాయిగా ఉండాలి’అనే వారు నాన్న. ఫెయిల్యూర్‌ అయితేనే కదా సక్సెస్‌ తెలిసేది అంటూ చెప్పేవారు. అనుభవంలో నాకో విషయం తెలిసింది. ‘మానాన్న సునీల్‌ శెట్టి. పేరున్న నటుడు అనుకుంటే కుదరదు. ప్రతిభ ఉండాలి’ అనిపించింది. మనల్ని మనం ప్రూవ్‌ చేసుకోకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సక్సెస్‌ మాత్రమే మాట్లాడుతుందని త్వరగా అర్థమైంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆశ ఉంది.’’


చిన్నప్పటినుంచీ ఐశ్వర్య రాయ్‌, కాజోల్‌ అంటే ఇష్టం. వాళ్ల గ్రేస్‌ ఎవరికీ రాదు. ఇక హీరోల్లో రణ్‌వీర్‌సింగ్‌ నటన అద్భుతం. సినిమా పట్ల అతనికున్న ప్యాషన్‌ అద్భుతం. కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా.. పప్పీలతో ఆడుకోవాలన్నా ఇష్టం. నా విజయం ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి.

Updated Date - 2022-05-22T05:43:25+05:30 IST