తగ్గేదే లే...

ABN , First Publish Date - 2021-10-12T06:17:18+05:30 IST

నవీన్‌ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్యా సేన్‌ గుప్తా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తగ్గేదే లే’. ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాసరాజు దర్శకుడు. ప్రేమ్‌ కుమార్‌ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా నిర్మించారు....

తగ్గేదే లే...

నవీన్‌ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్యా సేన్‌ గుప్తా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తగ్గేదే లే’. ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాసరాజు దర్శకుడు. ప్రేమ్‌ కుమార్‌ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిత్రనిర్మాణ సంస్థ భద్ర ప్రొడక్షన్స్‌ లోగోను ‘ఎంఈఐఎల్‌’ పీపీరెడ్డి ఆవిష్కరించారు. టైటిల్‌ లోగోను నిర్మాతలు విడుదల చేశారు. ‘‘మంచి కథలు చెప్పాలని ప్రొడక్షన్‌ ప్రారంభించాం. కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమిది’’ అని ప్రేమ్‌ కుమార్‌ పాండే అన్నారు. ‘‘సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తాం’’ అని పీవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. నిర్మాణ విషయాలన్నీ నన్ను చూసుకోమని చెప్పిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని రాజా రవీంద్ర తెలిపారు. ‘‘కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమైనా... నిర్మాతలు అడిగినవన్నీ సమకూర్చారు’’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌, నటులు ‘ఆటో’ రామ్‌ ప్రసాద్‌, ‘గెటప్‌’ శీను, మహేశ్‌ ఆచంట పాల్గొన్నారు.


Updated Date - 2021-10-12T06:17:18+05:30 IST