Kangana Ranaut అడుగుజాడల్లో నడుస్తోన్న Taapsee Pannu

ABN , First Publish Date - 2021-10-09T01:03:24+05:30 IST

నెపోటిజం అనే మాట సినీ ఇండస్ట్రీల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో అయితే అది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. స్టార్ కిడ్స్‌ను బాలీవుడ్‌లో లాంచ్ చేయడంలో కరణ్ జోహర్‌కు మంచి పేరు ఉంది. అందుకే బాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటులందరూ కరణ్ జోహర్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు.

Kangana Ranaut అడుగుజాడల్లో నడుస్తోన్న Taapsee Pannu

నెపోటిజం అనే మాట సినీ ఇండస్ట్రీల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో అయితే అది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. స్టార్ కిడ్స్‌ను బాలీవుడ్‌లో లాంచ్ చేయడంలో కరణ్ జోహర్‌కు మంచి పేరు ఉంది. అందుకే బాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటులందరూ కరణ్ జోహర్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. కంగనా రనౌత్ అయితే గతంలో కరణ్ జోహర్‌ను ‘‘ఫ్లాగ్ బేరర్ ఆఫ్ నెపోటిజం’’గా అభివర్ణించింది. తాజాగా తాప్సీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తోంది. తనతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌లు అందరూ తనతో నటించడానికి ఆసక్తి చూపలేదని ఆమె చెప్పింది. సోనాక్షి సిన్హా స్టార్ కిడ్స్‌పై చేసిన కామెంట్‌పై ఆమె స్పందించింది. 


శత్రఘ్న సిన్హా కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొనాక్షి సిన్హా స్టార్ కిడ్స్‌కు కూడా సినిమాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పింది. ఒకానొక సమయంలో వారిని కూడా చిత్రాల నుంచి తప్పిస్తారని తెలిపింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో..‘‘ స్టార్ కిడ్స్ అనే మాట పనికి రానిది. స్టార్ కిడ్స్ కూడా చిత్రాలను కొల్పోతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మమ్మల్ని మూవీ నుంచి తప్పించరని ఎవరూ కూడా బయటికి వచ్చి చెప్పరు. జీవితంలో ఇటువంటివి తరచుగా జరుగుతుంటాయి. అటువంటి వాటిని 

మర్చిపోయి ముందుకు సాగాలి ’’ అని వివరించింది.  


సొనాక్షి కామెంట్స్‌పై తాప్సీ స్పందించింది.  ‘‘ స్టార్ కిడ్ అయినా సరే  కచ్చితంగా ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరు సినిమాలను కొల్పోవాల్సి వస్తుంది. ఆ చిత్రంలో మరొకరు నటిస్తారు. ఈ కామెంట్స్‌తో నేను ఏకీ భవిస్తాను. స్టార్ కిడ్స్ బయటివారు అనే కారణంతో చిత్రాలను కొల్పోరు. కానీ, బయటివారు అనే కారణంతో మేం చిత్రాలను కొల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మూవీస్‌లో నటించడానికి ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్న వ్యక్తి సిద్ధంగా ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి వారి పేరును సిఫారసు చేస్తారు. మేం కొల్పోయిన చిత్రాల్లో నటించేవారు ఎక్కువగా స్టార్ కిడ్సే ఉంటారు ’’ అని చెప్పింది. బాలీవుడ్‌లో కొత్తవారికి అవకాశాలను కల్పించడం కోసం తాప్పీ ‘‘ ఔట్ సైడర్స్ ఫిలిమ్స్ ’’ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది.


Updated Date - 2021-10-09T01:03:24+05:30 IST