Kbcలో తన సీక్రెట్స్ అడిగిన అభిమానికి Taapsee Pannu రిప్లై!

`పింక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తాప్సీ పన్ను ప్రతిభ గల నటిగా గుర్తింపు దక్కించుకుంది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న `కౌన్ బనేగా కరోడ్‌పతి-13` కార్యక్రమానికి తాజాగా హాజరైన సాహిల్ అహిర్‌వాల్ అనే వ్యక్తి హాట్ సీట్లో కూర్చోని తాప్సీ గురించి మాట్లాడాడు. `మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవర`ని సాహిల్‌ను అమితాబ్ అడగగా.. అతను తాప్సీ అని చెప్పాడు. తాప్సీ అంటే లవ్, క్రష్, సర్వస్వం అని పేర్కొన్నాడు. అంతేకాదు తాప్సీ గురించి అమితాబ్‌ను ఎన్నో ప్రశ్నలడిగాడు. 


తాప్సీ, అమితాబ్ కలిసి `పింక్`, `బాద్లా` సినిమాల్లో నటించారు. దీంతో తాప్సీ ఇష్టాఇష్టాల గురించి అమితాబ్‌ను సాహిల్ ప్రశ్నించాడు. తాప్సీకి ఇష్టమైన ఆహారం ఏంటని అడిగాడు. అయితే తాప్సీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తనకు తెలియదని అమితాబ్ చెప్పారు. తాజాగా ఆ కార్యక్రమం చూసిన తాప్సీ.. స్పందించింది. `సాహిల్.. నాకు ఛోలే బాతురే అంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడైనా కలిస్తే కచ్చితంగా ఛోలే బాతురే తిందాం. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు చేరినందుకు నీకు అభినందనలు` అని తాప్సీ ట్వీట్ చేసింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Green India Challenge ఎంపీ సంతోష్‌ను అభినందించిన అమితాబ్బిగ్‌బీ KBC షోలో జాకీష్రాఫ్, సునీల్ శెట్టి హంగామా.. ఇంట్లో ఆతిథ్యం గురించి ఆసక్తికర కామెంట్స్..పెద్ద హీరోలెవరూ నాతో పనిచేసేందుకు సిద్ధంగా లేరు: Taapsee Pannu

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.