WORLD RECORD : ఇక యూట్యూబ్‌లో అతి పెద్ద ఛానల్ మనదే!

ABN , First Publish Date - 2021-12-07T02:20:56+05:30 IST

యూట్యూబ్‌లో మనం రికార్డ్ సృష్టించాం! ఎలాగంటారా? ఇంత వరకూ మరే ఇతర దేశానికి చెందిన యూట్యూబ్ ఛానల్ కూడా సాధించని ఘనత మన స్వంతమైంది. ఇప్పుడు మన దేశానికి చెందిన ఒక ఛానల్ ప్రపంచపు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది!

WORLD RECORD : ఇక యూట్యూబ్‌లో అతి పెద్ద ఛానల్ మనదే!

యూట్యూబ్‌లో మనం రికార్డ్ సృష్టించాం! ఎలాగంటారా? ఇంత వరకూ మరే ఇతర దేశానికి చెందిన యూట్యూబ్ ఛానల్ కూడా సాధించని ఘనత మన స్వంతమైంది. ఇప్పుడు మన దేశానికి చెందిన ఒక ఛానల్ ప్రపంచపు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది!

బాలీవుడ్ గురించి తెలిసిన వారికి ‘టీ-సిరీస్’ తెలియకుండా ఉండదు. ఆడియో పాటలు, వీడియో పాటలు అనగానే హిందీ సినిమా ప్రియులకి దశాబ్దాలుగా అదే రికార్డింగ్ కంపెనీ గుర్తుకు వస్తుంది. అయితే, గత కొంత కాలంగా భూషణ్ కుమార్ నేతృత్వంలో టీ సిరీస్ సినీ నిర్మాణ సంస్థగానూ దూసుకుపోతోంది. దాంతో ఆ కంపెనీ యూట్యూబ్ ఛానల్‌కి భారీగా సబ్‌స్క్రైబర్స్ పెరుగుతూ వస్తున్నారు. అంతే కాదు, టీ సిరీస్‌కు తమ ప్రధాన ఛానల్ కాకుండా మరో 28 ఛానల్స్ వివిధ భాషల్లో, జానర్స్‌లో ఉన్నాయి. వీటన్నిటికి కలిపి మొత్తం సబ్‌స్క్రైబర్స్ సంఖ్య ఎంతో తెలుసా? 383 మిలియన్లు! ఇంత వరకూ టీ సిరీస్ సంపాదించుకున్న వ్యూస్... 718 బిలియన్లు!

టీ సిరీస్ సంస్థ తమ అన్ని ఛానల్స్‌కు కలుపుకునే కాదు... కేవలం ‘టీ సిరీస్’ అనే పేరుతో నడిచే ప్రధాన ఛానల్‌కు మాత్రమే 200 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ను పోగేయగలిగింది! ఒకే ఒక్క యూట్యూబ్ ఛానల్‌కు ఇంత మంది సబ్‌స్క్రైబర్స్ ఉండటం గతంలో ఎప్పుడూ జరగలేదు. మరే దేశంలోని ఏ ఇతర యూట్యూబ్ ఛానల్ కూడా ఈ ఘనత సాధించలేదు. తొలిసారి ఒక ఇండియన్ యూట్యూబ్ ఛానల్ ‘మోస్ట్ ఫేవరెట్ ఛానల్‌‘గా సత్తా చాటింది! 

Updated Date - 2021-12-07T02:20:56+05:30 IST