కృత్రిమ వజ్రం... కాన్సెప్టే కొత్తగా అనిపించింది

ABN , First Publish Date - 2021-12-06T06:42:25+05:30 IST

‘‘ఏ సినిమా విజయానికైనా కథే ముఖ్యం. అలాంటి మంచి కథ ‘రామ్‌ అసుర్‌’కి దొరికింద’’న్నారు అభివన్‌ సర్దార్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రామ్‌ అసుర్‌’ ఇటీవలే విడుదలైంది...

కృత్రిమ వజ్రం... కాన్సెప్టే కొత్తగా అనిపించింది

‘‘ఏ సినిమా విజయానికైనా కథే ముఖ్యం. అలాంటి మంచి కథ ‘రామ్‌ అసుర్‌’కి దొరికింద’’న్నారు అభివన్‌ సర్దార్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రామ్‌ అసుర్‌’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా అభినవ్‌ మాట్లాడుతూ ‘‘కృత్రిమంగా వజ్రం తయారు చేయడం  అనే కాన్సెప్ట్‌తో సాగిన సినిమా ఇది. ఆ ఆలోచనే చాలా కొత్తగా అనిపించింది. అలాంటి కథ ఎంచుకోవడం మా విజయానికి తొలి అడుగు. నటీనటులంతా చక్కగా నటించారు. ముఖ్యంగా నా పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. భీమ్స్‌ సంగీతం, ప్రభాకర్‌రెడ్డి ఫొటోగ్రఫీ ఈ కథకు వన్నె తెచ్చాయి. నిజానికి ఈ సినిమాని ఓటీటీ కోసం, యూ ట్యూబ్‌ కోసం చేద్దామనుకున్నాం. కానీ కథలో మంచి ఫ్లో ఉంది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా థియేటర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌ చేశాం. ఈ సినిమాతో మేం అనుకున్న లక్ష్యం చేరుకున్నాం. మంచి నటుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం. హీరోగా మాత్రమే చేయాలని రూలేం లేదు. కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధమే’’ అన్నారు. 


Updated Date - 2021-12-06T06:42:25+05:30 IST