ఖడ్గధారి కీర్తి

ABN , First Publish Date - 2021-12-02T09:55:35+05:30 IST

కుందనపు బొమ్మ కత్తి చేతబట్టారు. సముద్రపు సింహం మరక్కార్‌కు జోడీగా కదనరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మరక్కార్‌’...

ఖడ్గధారి కీర్తి

కుందనపు బొమ్మ కత్తి చేతబట్టారు. సముద్రపు సింహం మరక్కార్‌కు జోడీగా కదనరంగంలోకి  అడుగుపెట్టబోతున్నారు.  కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మరక్కార్‌’. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీర్తిసురేష్‌ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చేతిలో ఖడ్గం, పవర్‌ఫుల్‌ లుక్‌లో కీర్తిసురేష్‌ రాజసం ఉట్టిపడేలా రూపొందించిన పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Updated Date - 2021-12-02T09:55:35+05:30 IST