పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్న బాలీవుడ్ నటి

జాతీయ అంశాలపై తనదైన శైలిలో బోల్డ్‌గా స్పందించే నటి స్వర భాస్కర్. తను పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. అందుకోసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టు వెల్లడించింది. దీపావళి పండగను  ఢిల్లీలోని ఒక అనాథాశ్రమంలో స్వర భాస్కర్ జరుపుకొంది. తను పిల్లలను దత్తత తీసుకోవడానికి సెంట్రల్ అడాఫ్టేషన్ రిసోర్సెస్ అథారిటీ(CARA) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పింది. స్వర భాస్కర్‌కు ఇప్పటి వరకు వివాహం కాలేదు. అయినప్పటికీ పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటుంది.


తాజాగా ఆమె ఒక మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘‘ నాకు కుటుంబం, పిల్లలు కావాలి. అనాథాశ్రామాల్లో  ఉండే లక్షలాదిమంది పడే బాధల గురించి నాకు తెలుసు. అదృష్టం కొద్ది భారత్‌లో ఒంటరి మహిళలు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. పిల్లలను దత్తత తీసుకున్న అనేకమంది దంపతులను నేను కలిశాను. దత్తత తీసకోవాలనే ఆలోచనకు నా తల్లిదండ్రులు కూడా మద్దతు పలుకుతున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడానికి వేచి చూసే జాబితా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. మాములుగా అయితే 3 ఏళ్ల వరకు వేచి చూడాలి ’’ అని స్వర భాస్కర్ చెప్పింది. 


స్వర భాస్కర్ ప్రస్తుతం ‘‘ షీర్ కుర్మా’’ అనే షార్ట్ ఫిలింలో నటిస్తుంది. ఫరజ్ అరీఫ్ అన్సారీ ఈ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించారు. షబనా అజ్మీ, దివ్య దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.