మూడు సార్లు పెళ్లి చేసుకుందామనుకుని ఆగిపోయా.. దేవుడు నన్ను రక్షించాడు.. Sushmita Sen ఇంట్రస్టింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-07-01T19:16:36+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ నటీమణుల్లో సుస్మితా సేన్ ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కీరిటాన్ని అందుకున్న ఈ నటి..

మూడు సార్లు పెళ్లి చేసుకుందామనుకుని ఆగిపోయా.. దేవుడు నన్ను రక్షించాడు.. Sushmita Sen ఇంట్రస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లోని పాపులర్ నటీమణుల్లో సుస్మితా సేన్ (Sushmita Sen) ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ (Miss Universe) కీరిటాన్ని అందుకున్న ఈ నటి అనంతరం బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ అనుకున్నంతా గుర్తింపు సాధించలేకపోయింది. దీంతో కొన్నేళ్ల వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందడంతో సుస్మితా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇటీవలే రెండో సీజన్ కూడా వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూడో సీజన్ కూడా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని తెలియజేసింది.


సుస్మితా మాట్లాడుతూ.. ‘అదృష్టవశాత్తూ నేను నా జీవితంలో చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలిశాను. అయినప్పటికీ నేను పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు చాలా డల్‌గా అనిపించడం. దీనికి నా పిల్లలతో సంబంధం లేదు. నా పిల్లలు ఎప్పుడూ నాకు అడ్డుపడలేదు. నా పిల్లలిద్దరూ నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులను ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించారు. ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. వారు అందరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని అందించారు. అయితే నేను మూడుసార్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ అది జరగలేదు. వారు ఓ మాట మీద నిలబడకుండా, అస్థిరమైన మనస్సులు ఉన్న మగాళ్లు. అలాంటి వారి నుంచి నన్ను, నా ఇద్దరు పిల్లలు రెనీ సేన్, అలీశాను దేవుడు రక్షించాడు’ అని ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-07-01T19:16:36+05:30 IST