సూర్య తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ షూటింగ్ పూర్తి!
ABN , First Publish Date - 2021-11-10T20:24:06+05:30 IST
తమిళ స్టార్ హీరో సూర్య.. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రతీ ఒక్కరిచేత కన్నీళ్ళు పెట్టించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న సూర్య. తదుపరి చిత్రాన్ని కూడా విడుదలకు రెడీ చేస్తున్నారు.

తమిళ స్టార్ హీరో సూర్య.. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రతీ ఒక్కరిచేత కన్నీళ్ళు పెట్టించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న సూర్య. తదుపరి చిత్రాన్ని కూడా విడుదలకు రెడీ చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఎదర్కుమ్ తునిందవన్’ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నారు.