వెంకీ ‘సూర్య ఐపీఎస్‌’లో.. హీరోయిన్‌ అలా మారింది!

ABN , First Publish Date - 2021-06-06T20:38:34+05:30 IST

పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా తీసిన సినిమాల్లో ‘సూర్య ఐపీఎస్‌’ ఒకటి. ఈ సినిమాలో..

వెంకీ ‘సూర్య ఐపీఎస్‌’లో.. హీరోయిన్‌ అలా మారింది!

పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా తీసిన సినిమాల్లో ‘సూర్య ఐపీఎస్‌’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేశ్‌ ఐపీఎస్‌ అధికారిగా నటించారు.ప్రారంభంలో సినిమాకు అనుకున్న కథ వేరు, హీరోయిన్‌ వేరు. బాలీవుడ్‌ నటి మీనాక్షి శేషాద్రిని మొదట హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 1989 డిసెంబర్‌ ఒకటిన చెన్నైలో షూటింగ్‌ మొదలుపెట్టారు. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి, తొలి క్లాప్‌ కొట్టి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. అయితే అప్పుడు ఓ స్టోరీ లైన్‌ అనుకుని షూటింగ్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కథ నచ్చకపోవడంతో వేరే కథను సిద్ధం చేసుకొని షూటింగ్‌కు వెళ్లాలనుకొనేంతలో మరో చిత్రం ఫైట్‌ సీక్వెన్స్‌లో హీరో వెంకటేశ్‌కు గాయాలు కావడంతో కొంత జాప్యం జరిగింది. చివరకు ఆరు నెలల అనంతరం హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించారు. అయితే హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం పెరగడం వల్ల మీనాక్షి శేషాద్రికి బదులు విజయశాంతిని తీసుకొన్నారు. రాజకీయ నేపథ్యంలో ‘సూర్య ఐపీఎస్‌’ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు కోదండరామిరెడ్డి.

Updated Date - 2021-06-06T20:38:34+05:30 IST