Surya: 'జై భీమ్' చిత్రానికి మరో అరుదైన ఘనత

ABN , First Publish Date - 2022-01-20T13:20:33+05:30 IST

'జై భీమ్' చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Surya: 'జై భీమ్' చిత్రానికి మరో అరుదైన ఘనత

'జై భీమ్' చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైన 'జై భీమ్' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే కాకుండా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఓ మైలురాయి వంటి చిత్రమని విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ  చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య - జ్యోతిక నిర్మించారు. ఇందులో మణికందన్ - లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - రజిషా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

Updated Date - 2022-01-20T13:20:33+05:30 IST