తెలుగులో స్టార్ డైరెక్టర్‌తో సూర్య..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త్వరలో తెలుగు స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య కాస్త రేస్‌లో వెనకబడిన ఈ హీరో 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో భారీ హిట్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు దర్శకులతో తెలుగు స్ట్రైట్ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ఇద్దరు బోయపాటి శ్రీను, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరితో ముందు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా ధనుష్, తెలుగు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ త్రిభాషా చిత్రం చేయనున్నట్టు ప్రకటన వచ్చింది. మరోస్టార్ హీరో విజయ్ కూడా తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడు. త్వరలో దీని ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో సూర్య కూడా ఓ స్ట్రైట్ మూవీని అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఏ దర్శకుడితో ప్రాజెక్ట్ ఒకే చేస్తాడో చూడాలి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.