బన్నీకి సర్‌ప్రైజ్‌ వెల్‌కమ్‌... టీమ్‌ సెలబ్రేషన్స్‌!

ABN , First Publish Date - 2022-01-29T22:49:24+05:30 IST

‘పుష్ప’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 16 రోజులు విహారయాత్ర కోసం దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. తదుపరి షూటింగ్‌కు వెళ్లే ముందు కాస్త విరామం తీసుకుని టూర్‌కి వెళ్లిన ఆయన శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

బన్నీకి సర్‌ప్రైజ్‌ వెల్‌కమ్‌... టీమ్‌ సెలబ్రేషన్స్‌!

‘పుష్ప’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 16 రోజులు విహారయాత్ర కోసం దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. తదుపరి షూటింగ్‌కు వెళ్లే ముందు కాస్త విరామం తీసుకుని టూర్‌కి వెళ్లిన ఆయన శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ట్రిప్‌ ముగించుకుని ఇంటికి చేరుకున్న బన్నీకు తన గారాలపట్టీ అర్హ సర్‌ప్రైజ్‌ చేస్తూ స్పెషల్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. గులాబీ రేకలు, కొన్ని ఆకులతో ‘వెల్‌కమ్‌ నాన్న’ అని గుమ్మం ఎదుట రాశారు. అది చూసి బన్నీ ఆనందానికి గురయ్యారు. ‘‘16 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అర్హ చెప్పిన స్వీట్‌ వెల్‌కమ్‌ నాకెంతో ఆనందం కలిగించింది’’ అని ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘పుష్ప’ సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా ‘అల్లు అర్జున్‌ టీమ్‌ తమ కార్యాలయంలో ప్రత్యేక పోస్టర్లు, ఎర్ర చందనం దుంగలను, గొడ్డలిని ఏర్పాటు చేసి సెలబ్రేట్‌ చేశారు. ఆ ఫొటోలను బన్నీ షేర్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. 










Updated Date - 2022-01-29T22:49:24+05:30 IST