Suriya: ఇష్టం లేకుండానే రోలెక్స్ క్యారెక్టర్ చేశా.. దానికి కారణం ఆయనే..

ABN , First Publish Date - 2022-10-11T18:14:03+05:30 IST

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో సూర్య (Suriya) ఒకరు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు...

Suriya: ఇష్టం లేకుండానే రోలెక్స్ క్యారెక్టర్ చేశా.. దానికి కారణం ఆయనే..

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో సూర్య (Suriya) ఒకరు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. హీరోగా మంచి ఫేమ్ ఉన్నప్పటికీ తనకి నచ్చితే ఏ క్యారెక్టరైనా చేయడానికి వెనుకాడడు. అది విలన్ పాత్రైనా సరే. అందులో భాగంగా.. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్ (Vikram)’ సినిమాలో రోలెక్స్ (Rolex) అనే క్యామియో పాత్రలో సూర్య కనిపించాడు. ఆ పాత్ర గురించి తాజాగా జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్‌లో సూర్య మాట్లాడాడు.


అక్టోబర్ 9న బెంగుళూరులో 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ జరిగాయి. అందులో.. 2020 సూర్య చేసిన ‘సూరరై పొట్రు’లో మార పాత్రకి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డు అందుకున్న తర్వాత రోలెక్స్ పాత్ర గురించి సూర్య మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ‘ఈరోజు నేను ఏం చేసినా.. జీవితంలో ఈ స్థాయిలో ఉండటానికి కమల్‌ హాసన్ (Kamal Haasan) సార్‌ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఫోన్‌ చేసి అవకాశం ఉందని చెప్పినప్పుడు దాన్ని వదులుకోదలుచుకోలేదు. దీన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. భయపెట్టిన పనిని చేస్తేనే ఎదుగుదల అని నమ్ముతాను. అందుకే చివరి నిమిషంలో రోలెక్స్ పాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నా. నిజానికి లోకేశ్‌కి ఈ పాత్ర చేయనని చెప్పాలని అనుకున్నా. కానీ చేశాను. అది కేవలం ఒక వ్యక్తి కోసం.. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు.


కాగా..  కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్’ దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. అంతేకాకుండా.. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం క్లైమాక్స్‌లో సూర్య డ్రగ్స్ కింగ్‌పిన్ రోలెక్స్ పాత్రను కనిపించాడు. అందులో కేవలం ఐదు నిమిషాలే కనిపించినప్పటికీ.. విలన్‌గా ప్రేక్షకులని భయపెట్టాడు. మరోసారి తనలోని నటుడిని చూపించాడు. అలాగే.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా ‘ఖైదీ 2’లో ఆయన తమ్ముడు కార్తీ హీరోగా సూర్య విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా.. ఆ తర్వాత వచ్చే ‘విక్రమ్ 3’లో కార్తీ, కమల్ హాసన్‌కి విలన్‌గా సూర్య కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.



Updated Date - 2022-10-11T18:14:03+05:30 IST