Suriya: లోకేశ్ కనకరాజ్ తర్వాతి చిత్రంలో సూర్య, కార్తి కలసి నటిస్తారా..స్పందించిన హీరో..

ABN , First Publish Date - 2022-08-05T01:39:41+05:30 IST

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమాలో సూర్య (Suriya) అతిథి పాత్రలో మెరిశాడు.

Suriya: లోకేశ్ కనకరాజ్ తర్వాతి చిత్రంలో సూర్య, కార్తి కలసి నటిస్తారా..స్పందించిన హీరో..

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమాలో సూర్య (Suriya) అతిథి పాత్రలో మెరిశాడు. రోలెక్స్ (Rolex) పాత్రలో గ్యాంగ్ లీడర్‌గా అలరించాడు. లోకేశ్ కనకరాజ్ తర్వాతి సినిమాలో అన్నదమ్ములు కలసి నటిస్తారా అనే ప్రశ్నకు సూర్య తాజాగా సమాధానమిచ్చాడు.  


కార్తి హీరోగా నటించిన సినిమా ‘విరుమన్’ (Viruman). ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఆగస్టు 3న మదురైలో జరిగింది. ఆడియో లాంచ్ ఈవెంట్‌కు సూర్య హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడి అభిమానులు రోలెక్స్ అని అరవడం మొదలుపెట్టారు. దీంతో సూర్య ‘‘రోలెక్స్, డిల్లీ ఏం చేయాలనుకుంటున్నారు’’ అని అడిగాడు. అందుకు కార్తి.. వారిద్దరు ఇంట్లో బాగా కొట్టుకునేవారు అని సమాధానమిచ్చాడు. అంతలోనే సూర్య కల్పించుకుని .. ‘‘కాలమే నిర్ణయిస్తుంది. అంత వరకు వేచి చూద్దాం’’ అని చెప్పాడు. కార్తి గతంలో నటించిన సినిమా ‘ఖైదీ’. ఈ చిత్రంలో డిల్లీ పాత్రలో అతడు కనిపించాడు. ఈ మూవీకి లోకేశ్ దర్శకత్వం వహించాడు. లోకేశ్ తెరకెక్కించిన మరో సినిమా ‘విక్రమ్’ లో రోలెక్స్ పాత్రలో సూర్య అలరించాడు. ‘విక్రమ్’ లో ఓ సీన్‌లో డిల్లీ పాత్రకు సంబంధించి కార్తి వాయిస్ వినిపిస్తుంది. కానీ, అతడు మాత్రం కనిపించాడు. దీంతో లోకేశ్ తెరెక్కించే తదుపరి చిత్రంలో ఈ సోదరులిద్దరు కలసి నటిస్తారనే వదంతులు హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. ‘విక్రమ్’ కు కొనసాగింపు చిత్రం ఉంటుందని లోకేశ్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. ‘విరుమన్’ ను 2డీ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదల కానుంది.

Updated Date - 2022-08-05T01:39:41+05:30 IST