సంక్రాంతికి ఎలా ఉంటుందో.. చూడాలి: డి.సురేశ్‌బాబు

ABN , First Publish Date - 2021-11-27T23:47:42+05:30 IST

‘‘సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి ఎక్కడో మిస్‌ కమ్యూనికేషన్‌ ఉందనిపిస్తుంది. టికెట్‌ ధర మరీ అంత తక్కువ పెట్టడమనేది కూడా కరెక్ట్‌ కాదు. ఓ సినిమాను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్‌ కరెంట్‌ బిల్లు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు.

సంక్రాంతికి ఎలా ఉంటుందో.. చూడాలి: డి.సురేశ్‌బాబు

‘‘సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి  ఎక్కడో మిస్‌ కమ్యూనికేషన్‌ ఉందనిపిస్తుంది. టికెట్‌ ధర మరీ అంత తక్కువ పెట్టడమనేది కూడా కరెక్ట్‌ కాదు. ఓ సినిమాను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్‌ కరెంట్‌ బిల్లు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. తాజాగా ఆయన నిర్మించిన ‘దృశ్యం2’ చిత్రం ఇటీవల ఓటీటీ వేడుకగా విడుదలైంది. వెంకటేశ్‌, మీనా జంటగా జీతూ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందిన సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు విలేకర్లతో మాట్లాడారు.  


‘దృశ్యం 2’ మలయాళంలో పెద్ద హిట్‌ అయింది. వెంటనే రైట్స్‌ తీసుకున్నాం. జీతూ జోసెఫ్‌ను స్ర్కిప్ట్‌ పంపించమని అడిగాను. కొన్ని మార్పులు, చేర్పులు సూచించాను. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్ర్కిప్ట్‌ పూర్తయ్యాక షూటింగ్‌ ప్రారంభించాం. ఈ సినిమా పూర్తయిన అంత త్వరగా ఏదీ కాలేదు. ‘దృశ్యం 2’ అనేది కమర్షియల్‌ సినిమా కాదు, పాటలు, ఫైట్లు ఉండే చిత్రాలను థియటర్‌లో చూేస్త మంచి కిక్‌ వస్తుంది. దృశ్యం 2ను థియేటర్లో విడుదల చేసినా ఇదే స్పందన వచ్చేది. కలెక్షన్లు ఎంత వస్తాయో చెప్పలేం. ఓటీటీ విడుదల అయితే ఫైనాన్షియల్‌గా ేసఫ్‌ జోన్‌లో ఉంటాం. 

అది సరైన నిర్ణయం కాదు...

ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్‌ రేట్‌ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో రూ.20, రూ.30 అంటే చాలా నష్టం వాటిల్లుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల ‘దృశ్యం 2’ సినిమాను థియేటర్స్‌కు ఇవ్వలేదు. ఓటీటీలో అయితే బాగుంటుందని అనుకున్నాం.


కచ్చితంగా వస్తారు...

ప్రభుత్వంతో ఎక్కడో మిస్‌ కమ్యూనికేషన్‌ జరుగుతుంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్‌ కాదు. ఓ ప్రొడక్ట్‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్‌ కరెంట్‌ బిల్లు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. థియేటర్లో చూేస్త వచ్చే ఎక్స్‌పీరియన్స్‌ వేరు. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియన్స్‌  కచ్చితంగా వస్తారు. 


అప్పుడు 400.. ఇప్పుడు 1500 థియేటర్లు అడుగుతున్నారు...

పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ తెలుసు అందుకే ఫెస్టివల్‌ సీజన్‌కు రావాలని ప్రతి నిర్మాత ఫిక్స్‌ అయ్యారు. ఒకప్పుడు పండుగకు నాలుగు సినిమాలు, ఒక్కో సినిమాకు 400 థియేటర్లు సర్దుబాటు అయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్ర్కీన్స్‌ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో.. చూడాలి. 


సర్‌ప్రైజ్‌ అవుతారు...

ప్రస్తుతం .శాకిని డాకిని’, ‘దొంగలున్నారు జాగ్రత’,  ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’ అనే మూడు సినిమాలను ఓటీటీకి  ఇచ్చేశాను. కొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్‌ మీదున్నాయి. వెంకటేష్‌ హీరోగా ‘రానా నాయుడు’, ‘ఎఫ్‌ 3’ కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవేంటో తెలిశాక అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు. 


డబ్బుతో కొలవొద్దు...

విరాటపర్వం ఇంకా ఐదు రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. సినిమా, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌ను డబ్బుతో కొలవొద్దు. హైద్రాబాద్‌ను దేశానికి సినీ రాజధాని చేేస దిశగా కేటీఆర్‌ ఆలోచిస్తున్నారు. సినిమా అనేది ఎక్కువ కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఎందుకు అంత సబ్సిడీ ఇస్తున్నారు. యూపీ ఎందుకు ఇండస్ర్టీ కోసం ట్రై చేస్తోంది.. సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది. సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవద్దు. 



Updated Date - 2021-11-27T23:47:42+05:30 IST