సురేశ్ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే వెరైటీ టైటిల్‌తో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించనున్నాడు. ఈ యంగ్ హీరో 'మత్తువదలరా' అనే సినిమా ద్వార టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఇటీవల 'తెల్లవారితే గురువారం' అనే సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మూడవ సినిమాగా 'దొంగలున్నారు జాగ్రత్త'లో నటించే అవకశం దక్కించుకున్నాడు. గురు ఫిలిమ్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సతీశ్ త్రిపుర దర్శకుడిగా పరిచయమవుతుండగా, థ్రిల్లర్ నేపథ్యంలో కథ సాగుతుందట. సముద్రఖని ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారు. కాగా త్వరలో రెగ్యులర్ షూటింగు మొదలుకాబోతోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.