కొన్ని క‌థ‌లు ఓటీటీలోనే చెప్పాలి: సుప్రియ యార్ల‌గ‌డ్డ‌

ABN , First Publish Date - 2022-01-21T03:34:07+05:30 IST

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1’ ప్రేక్షకాదరణ పొందిడంతో.. ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘లూజర్ 2’ మేకర్స్ రెడీ చేశారు. అభిలాష్ రెడ్డి..

కొన్ని క‌థ‌లు ఓటీటీలోనే చెప్పాలి: సుప్రియ యార్ల‌గ‌డ్డ‌

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1’ ప్రేక్షకాదరణ పొందిడంతో.. ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘లూజర్ 2’ మేకర్స్ రెడీ చేశారు. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సిరీస్ ‘జీ 5’ ఓటీటీలో జనవరి 21న టెలికాస్ట్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సిరీస్ వివ‌రాలను తెలిపేందుకు గురువారం అన్న‌పూర్ణ ఏడెకరాల స్టూడియోలో టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ ‘లూజ‌ర్‌ 2’ టీమ్‌ను ప‌రిచ‌యం చేస్తూ.. ‘‘అన్న‌పూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులే దీనికి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. నేను క‌థ‌లు రాస్తాన‌ని అంటారు. కానీ ఆ క‌థ‌లు బాగుంటాయ‌ని ఎదుటివారు చెబితేకానీ తెలీదు. సినిమాకూ, ఓటీటీ క‌థ‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంటుంది. ఓటీటీలో చిన్న పాత్ర అయినా చాలా డిటైల్డ్‌గా రాయాలి. భ‌ర‌ద్వాజ్‌, శ్ర‌వ‌న్‌, అవినాష్ మొద‌టినుంచి క‌థ‌ను రాయాల‌ని అనుకుని వ‌చ్చారు. అవి విన్న వెంట‌నే ఏ పాత్ర‌ను చూసినా వాటికి పూర్తి న్యాయం చేశారు. వెబ్ క‌థ‌లు వేరుగా ఉంటాయి. అదే సినిమా అయితే లాగ్ అనేది ఎడిటింగ్‌లో తెలిసిపోతుంది. కానీ ఓటీటీలో లాగ్‌ ఉండాలి. దానిలోనూ అందం క‌నిపించాలి. దానికీ ఓ టైం పిరిడ్ ఉంటుంది. అటువంటి దాన్ని స‌రిగ్గా చూప‌గ‌లిగితే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు. ఇక స్క్రీన్ ఫేస్‌ కూడా ద‌గ్గ‌రా చూపించాలి. అందులో న‌టీన‌టులను ఎఫెక్టివ్‌గా చూపించ‌గ‌ల‌గాలి. ఒక్కోసారి క‌ళ్ళు కూడా మాట్లాడుతుంటాయి. దాన్ని క్యాచ్ చేయ‌గ‌ల‌గాలి. మాకు ఫేవ‌ర్ అంశం ఏమిటంటే, దీనికి ప‌నిచేసిన వారంతా మా అన్న‌పూర్ణ స్టూడియోస్ కాలేజీలో చ‌దువున్న వారే. అందుకే వారి మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డి క‌థ బాగా రావ‌డానికి దోహ‌ద‌ప‌డింది.

ద‌ర్శ‌కుడు అభిలాష్ ఒకసారి క‌థ‌ను చెప్ప‌డానికి వ‌చ్చాడు. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో స‌క్సెస్ అవ్వ‌ని వారు గురించి చెప్పారు. ఇలాంటి క‌థ‌లు ఎక్క‌డా చెప్ప‌లేం. ఓటీటీలోనే చెప్ప‌గ‌లం. అందుకు ‘జీ 5’ వారు మ‌మ్మ‌ల్ని న‌మ్మ‌డం అందుకు అనుగుణంగా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇప్ప‌టి యువ‌త‌రం ఏవైనా కొత్త విష‌యాలు మాకు నేర్పించేవారుగా ఉండాలి. అలా ఉన్న టీమ్ మాకు దొరికింది. కొత్త‌త‌రంలో టాలెంట్ బాగుంటుంది. రేపు ఓటీటీలో ‘లూజ‌ర్‌ 2’ చూశాక అది మరింత స్పష్టమవుతుంది..’’ అని అన్నారు.

Updated Date - 2022-01-21T03:34:07+05:30 IST