అన్నాత్తే దర్శకుడిని ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన Rajinikanth
ABN , First Publish Date - 2021-12-10T20:39:35+05:30 IST
అన్నాత్తే సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్న నటుడు రజినీకాంత్. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా

అన్నాత్తే సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్న నటుడు రజినీకాంత్. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి రోజున విడుదలైంది. సిరుతై శివ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. విమర్శకుల మెప్పు పొందనప్పటికి ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మారథం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని ఈ సినిమా కురిపించింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. అక్కడ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
అన్నాత్తే సినిమా మంచి కలెక్షన్లను సాధించడంతో తలైవా రజినీకాంత్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఆ చిత్ర దర్శకుడైన శివ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందజేశారు. శివకు బహుమతిగా గోల్డ్ చెయిన్‌ను అందజేసినట్టు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ కలిసి సన్ పిక్చర్స్ బ్యానర్‌లోనే మరో సినిమాకు కూడా పనిచేయబోతున్నారని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారా లేదా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, జగపతి బాబు, అభిమన్యు సింగ్, ఖుష్భూ, మీనా, సూరి, సతీష్, సత్యన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.