Madhavan: నంబి నారాయణ్, మాధవన్‌ను సత్కరించిన సూపర్ స్టార్ రజినీకాంత్

ABN , First Publish Date - 2022-07-31T21:17:06+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R.Madhavan). ‘సఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’

Madhavan: నంబి నారాయణ్, మాధవన్‌ను సత్కరించిన సూపర్ స్టార్ రజినీకాంత్

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R.Madhavan). ‘సఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ వంటి హిట్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). ఈ సినిమాకు మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది. జులై 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ను నంబి నారాయణ్‌న్ (Nambi Narayanan) జీవితం ఆధారంగా రూపొందించారు. ఇస్రోలో గూఢచార్యనికి పాల్పడ్డారనే తప్పుడు ఆరోపణలను ఆయనపై మోపిన సంగతి తెలిసిందే. 


‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ కు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఈ చిత్రానికీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా మాధవన్‌ను ప్రశంసించాడు. తన నివాసంలో మాధవన్‌ను, నంబి నారాయణ్‌న్‌ను రజినీ శాలువాతో సత్కరించారు. అందుకు సంబంధించిన వీడియోను మాధవన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఓ లెజెండ్ సమక్షంలో మరో లెజెండ్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ క్షణం మధురమైనది. రజినీ సర్ చూపిన ప్రేమకు, అభిమానానికీ ధన్యుడిని’’ అని మాధవన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో కింద అనేక మంది నెటిజన్స్ కూడా కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘ఒకే ఫొటోలో ఇద్దరు లెజెండ్స్’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘మీరు సత్కరానికీ అర్హుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించాలి’’ అని మరో నెటిజన్ స్పందించాడు. 





Updated Date - 2022-07-31T21:17:06+05:30 IST