జీ5 ఓటీటీలో ‘సామాన్యుడు’కి సూపర్ స్పందన

ABN , First Publish Date - 2022-03-15T06:27:03+05:30 IST

తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రం మార్చి 4 నుండి జీ5లో ప్రసారం అవుతుంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది. తెలుగులో విడుదలైన

జీ5 ఓటీటీలో ‘సామాన్యుడు’కి సూపర్ స్పందన

తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రం మార్చి 4 నుండి జీ5లో ప్రసారం అవుతుంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది. తెలుగులో విడుదలైన ‘సామాన్యుడు’కు వీక్షకుల నుండి సూపర్ స్పందన వచ్చినట్లుగా జీ5 యాజమాన్యం ప్రకటించింది. దీనితో ఇటీవలే విడుదలైన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘లూజర్’, ‘లూజర్ 2’, సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’.. అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయని, మార్చి 11 నుండి ‘రౌడీ బాయ్స్’ స్ట్రీమింగ్ కూడా ప్రారంభమైందని వారు తెలిపారు. 


కాగా, సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో మోస్ట్ పాపులర్ అయిన విశాల్ ఈ సినిమాలో వీరోచితంగా నటించారు. డింపుల్ హయతి, రవీనా రవి, యోగి బాబు మరియు రమణ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉండడంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. థియేటర్లలో కూడా ప్రేక్షకుల నుండి ఈ చిత్రం మంచి స్పందననే రాబట్టుకుంది. థియేటర్స్‌లలో చూడని వారుంటే.. తమ ఇళ్లలో లేదా ప్రయాణంలో సౌకర్యంగా ఉన్నపుడు జీ5‌ను సబ్ స్క్రైబ్ చేసుకొని వీక్షించవచ్చు.

Updated Date - 2022-03-15T06:27:03+05:30 IST