అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి: సూపర్ స్టార్ కృష్ణ

ఘట్టమనేని అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ ఓ విజ్ఞప్తి చేశారు. తమ ఫ్యామిలీ హీరో అశోక్ గల్లా నటించిన ‘హీరో’ చిత్రం అందరూ చూడాలని.. చూసి అతనిని ఆదరించాలని కోరారు. ఈ విషయం తెలుపుతూ ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. అందులో..


‘‘తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జనవరి 15న హీరో అశోక్ గల్లా నటించిన ‘హీరో’ సినిమా విడుదలవుతుంది. నేను ఈ సినిమా చూశాను.. ఎక్కడా బోర్ కొట్టలేదు. సబ్జెక్ట్‌లో కూడా నావెల్టీ ఉంది. ఇంతకుముందు నాకు తెలిసి ఇలాంటి సినిమా రాలేదు. చాలా చక్కగా సినిమా తీశారు. ఖచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. నా అభిమానులకు, మహేష్ బాబు అభిమానులకు విజ్ఞప్తి.. ఈ సినిమాని అందరూ చూసి అశోక్ గల్లాని ఆదరించి, అతనిని మంచి నటుడిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను..’’ అని కృష్ణ తెలిపారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.