మల్టీ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు మరో ఓటీటీ

ABN , First Publish Date - 2022-01-17T21:42:31+05:30 IST

మల్టీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మరో ఓటీటీ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే అనేక ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వేళ.. ఇప్పుడు అనేక రకాలైన కంటెంట్‌‌ని ఒకేచోట అందివ్వబోతోంది

మల్టీ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు మరో ఓటీటీ

మల్టీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మరో ఓటీటీ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే అనేక ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వేళ.. ఇప్పుడు అనేక రకాలైన కంటెంట్‌‌ని ఒకేచోట అందివ్వబోతోంది ‘సన్‌షైన్’ ఓటీటీ. ప్రస్తుతం ఈ ఓటీటీ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఓటిటి యాప్ లాంచ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్, యువ హీరో రామ్ కార్తిక్‌లు ఈ ఓటీటీని లాంచ్ చేశారు. 


అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ ఓటీటీ వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మా సన్‌షైన్ ఓటీటీ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీనిలో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అనేక రకాలైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్‌లో టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది..’’ అని తెలుపగా.. తమ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఓటీటీ మంచి సక్సెస్ అవ్వాలని, ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేయాలని కోరుతున్నట్లుగా తెలిపారు దర్శకుడు ప్రభాకర్, హీరో రామ్ కార్తీక్.

Updated Date - 2022-01-17T21:42:31+05:30 IST