మంచు విష్ణు హీరోగా ‘గాలి నాగేశ్వరరావు’ అనే సినిమా తెరక్కుతోంది. ఈ సినిమాకు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే తిరుపతిలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుందీ ఈ సినిమా. అయితే, సన్నీకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆమె మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో అతిథి పాత్రను పోషించారు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌తో ఆలరించారు.
మళ్ళీ ఇప్పటివరకు సన్నీలియోన్ తెలుగు సినిమాలలో కనిపించలేదు. అందుకు కారణం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటడమే అని టాక్. కానీ, ఇప్పుడు నటిస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’కు ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం సన్నీ 20 రోజులు డేట్స్ ఇచ్చారట. దీనికోసం దాదాపు 2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు శృంగార తారగా వెలిగిన సన్నీ గత కొంతకాలంగా రూటు మార్చి కమర్షియల్ సినిమాలను చేస్తున్నారు. ఇక ఆమెకున్న క్రేజ్ కారణంగానే ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రబృందం భారీగానే ముట్టచెబుతున్నారట.