Adipurush: ప్రభాస్ గురించి లక్ష్మణుడు ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2021-10-21T17:54:26+05:30 IST

పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ హిందీ సినిమా `ఆదిపురుష్`

Adipurush: ప్రభాస్ గురించి లక్ష్మణుడు ఏం చెప్పాడంటే..

పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ హిందీ సినిమా `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండగా, సీత్ర పాత్రలో కృతి సనన్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపిచబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సైఫ్, కృతి సనన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. 



లక్ష్మణ పాత్రలో నటించిన సన్నీ సింగ్ తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడాడు. `ప్రభాస్ నాకు పెద్దన్నలాంటి వాడు. కెమేరా ముందు, వెనక కూడా మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అంత పెద్ద స్టార్ అయినా అతను చాలా సింపుల్‌గా ఉంటాడు. తను స్టార్ అనే విషయం అతనికి తెలియదేమో అనిపిస్తుంటుంది. ఆతిథ్యంలో ప్రభాస్‌ను మించిన వారు లేరు. అతని క్యారవ్యాన్‌లో ఎప్పుడూ నాలుగైదు రకాలు ఆహార పదార్థాలు ఉంటాయ`ని చెప్పాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 23న `ఆదిపురుష్` నుంచి సర్‌ప్రైజ్ రానున్నట్టు సమాచారం.   

Updated Date - 2021-10-21T17:54:26+05:30 IST