అతడితో డేటింగ్ చేయడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పంటున్న Sunny Leone
ABN , First Publish Date - 2021-10-24T00:26:06+05:30 IST
గత అనుభవాలను మర్చిపోవడం అంత సులభం కాదు. కొన్నిరోజులు ప్రేమించుకుని అనంతరం విడిపోయినవారు తప్పు మీదంటే మీదని ఒకరిని మరొకరు నిందించుకుంటారు.

గత అనుభవాలను మర్చిపోవడం అంత సులభం కాదు. కొన్నిరోజులు ప్రేమించుకుని అనంతరం విడిపోయినవారు తప్పు మీదంటే మీదని ఒకరిని మరొకరు నిందించుకుంటారు. తాజాగా ఒక బాలీవుడ్ నటి కూడా అలానే చెబుతోంది.
కెనడా నుంచి వచ్చి బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన నటి సన్నీ లియోన్. ఒక స్టాండప్ కమెడియన్‌తో డేటింగ్ చేయడం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆమె తెలిపింది. కొన్ని ఏళ్ల క్రితం రస్సెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్‌తో సన్నీ లియోన్ డేటింగ్ చేసింది. కానీ, ఆ డేటింగ్ మున్నాళ్ల ముచ్చటగానే కొనసాగింది.
సన్నీ లియోన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ నేను రస్సెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్‌తో కొన్నేళ్లు డేటింగ్ చేశాను. ఆ బంధం చాలా త్వరగానే ముగిసిపోయింది. అనంతరం మేమిద్దరం స్నేహితులుగా మా జీవన ప్రయాణాన్ని కొనసాగించాం. అతడితో ఎందుకు డేటింగ్ చేశానా అనిపించేది? అతడితో డేటింగ్ చేయడమే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. కానీ, ఇప్పటికి మేం స్నేహితులుగా ఉన్నాం ’’ అని తెలిపింది.
సన్నీతో డేటింగ్ చేయడం గురించి రస్సెల్ పీటర్స్ మాట్లాడుతూ..‘‘ మేమిద్దరం డేటింగ్ చేసిన మాట నిజమే. ఆ సమయం చాలా అద్భుతంగా గడిచింది. సన్నీ రియల్ స్వీట్ హార్ట్ అని మీ అందరికీ తెలుసు ’’ అని చెప్పాడు.
సన్నీ లియోన్ 2011 ఏప్రిల్ 9న డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ మొదట లాస్ వేగస్‌లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి 3గురు పిల్లలు ఉన్నారు.
