‘బుజ్జీ... ఇలా రా..’లో మహమ్మద్ కయ్యుమ్‌గా సునీల్

ABN , First Publish Date - 2021-08-29T23:33:31+05:30 IST

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్‌ను బ‌ట్టే ఈ సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో

‘బుజ్జీ... ఇలా రా..’లో మహమ్మద్ కయ్యుమ్‌గా సునీల్

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్‌ను బ‌ట్టే ఈ సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు.

Updated Date - 2021-08-29T23:33:31+05:30 IST