కేఎల్.రాహుల్ పోస్టుకు స్పందించిన బాలీవుడ్ నటుడి కుమార్తె

ABN , First Publish Date - 2021-09-25T01:24:52+05:30 IST

మేం ఈ రోజుని ఏవిధంగా గడపాలో సూచనలు ఇవ్వాలంటూ క్రికెటర్ కే.ఎల్.రాహుల్ గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఆయన స్నేహితురాలు అతియాశెట్టి స్పందిస్తూ.. ఎవరు రాహుల్‌కు వీడియో కాల్ చేయాలనుకుంటున్నారన్నారు.

కేఎల్.రాహుల్ పోస్టుకు స్పందించిన బాలీవుడ్ నటుడి కుమార్తె

ముంబై: మేం ఈ రోజుని ఏవిధంగా గడపాలో సూచనలు ఇవ్వాలంటూ క్రికెటర్ కే.ఎల్.రాహుల్ గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఆయన స్నేహితురాలు అతియాశెట్టి స్పందిస్తూ.. ఎవరు రాహుల్‌కు వీడియో కాల్ చేయాలనుకుంటున్నారన్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..అతియా శెట్టి, కే.ఎల్.రాహుల్ కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. ఒకరి సోషల్ మీడియా పోస్టులకు మరొకరు స్పందిస్తుంటారు. ఇప్పటివరకు సహజీవనం చేస్తున్నట్టు వీరు ఎక్కడ ప్రకటించలేదు. 


గత నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఇద్దరు కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లినట్టు సమాచారం. లాజిస్టిక్స్ విభాగం భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు ప్రయాణించేటప్పుడు అందరి ఆటగాళ్లతో ప్రయాణించే వారి వివరాలు అందజేయాలని కోరింది. ఆటగాళ్లు తమ భాగస్వాముల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది.  కే.ఎల్.రాహుల్ ఈ సందర్భంగానే అతియాశెట్టి పేరును తన భాగస్వామిగా వెల్లడించాడు. సునీల్ శెట్టి కుమార్తె అతియాశెట్టి. హీరో అనే చిత్రం ద్వారా ఆమె చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా 2015లో విడుదలైంది. ఆమె సరసన ఈ సినిమాలో సూరజ్‌పంచోలి నటించారు. తన తదుపరి ప్రాజెక్టులను ఆమె ప్రకటించాల్సి ఉంది.








Updated Date - 2021-09-25T01:24:52+05:30 IST