తొలి సినిమా విడుదలకు ముందే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలిపిన బాలీవుడ్ నటుడు

సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ‘ హీరో ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయబోతున్నాడు. అతడు హీరోగా నటించిన చిత్రం తడప్. డిసెంబరు 3న విడుదల కాబోతుంది. రిలీజ్‌కు ముందే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన RX 100కు రీమేక్‌గా ఆ సినిమా  తెరకెక్కింది. 


తాజాగా అహాన్ శెట్టి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తడప్ సినిమా గురించి మాట్లాడాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన తానియా ష్రాఫ్ గురించి కూడా తెలిపాడు. ఈ సందర్భంగా ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. తను ఆమెతో గత 10ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పేర్కొన్నాడు. తనను మహిళ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డ కూడా ఆమె ఆసూయ పడదన్నాడు. ‘‘ నన్ను అన్ని విధాలా ఆమె అర్థం చేసుకుంటుంది. ఆమె మానసికంగా చాలా దృఢవంతురాలు.  స్వాతంత్ర్య భావాలు  కలది. నా నటన ప్రయాణంలో అండగా నిలిచినందుకు ఆమెకు కృతజ్ఞతలు. నాకు లభించే ప్రేమలో ఆమెకు కూడా భాగముంది. వెండి‌తెర మీద మీరు నటుడిని మాత్రమే చూస్తారు. ఆ నటుడి వెనుక ఎవరు ఉన్నది మాత్రం పట్టించుకోరు ’’ అని అహాన్ శెట్టి స్పష్టం చేశాడు.

 

తానియా ష్రాఫ్, అహాన్ శెట్టి ఇద్దరు కూడా ఒకే పాఠశాలలో చదువుకున్నారు. బిజినేస్ మేన్ జై దేవ్ ష్రాఫ్, రూమిలా ష్రాఫ్‌లా కుమర్తెనే  తానియా ష్రాఫ్. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్‌లో  ఫ్యాషన్ డిజైనింగ్‌ను అభ్యసించింది. తడప్ చిత్రానికి మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహించారు. తారా సుతారియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలోని పాత్ర కోసం అహాన్ శెట్టి 11కిలోల బరువు పెరిగాడు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.