గుండె నిండు గర్భిణిలా ఉంది.. ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది: సుకుమార్

‘గుండె నిండు గర్భిణిలా ఉంది.. ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది’ అంటూ దర్శకుడు సుకుమార్ ఉద్వేగభరితమయ్యారు. సీతారామశాస్త్రి రాయని పాటలాగా ప్రేక్షకలోకం మిగిలిపోయిందంటూ.. ఆయన ఫేస్‌బుక్ వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై సుకుమార్ స్పందన.. ఇప్పుడందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. 


‘‘గుండె నిండు గర్భిణిలా ఉంది

ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది

తల్లి కాగితానికి దూరమై 

అక్షరాల పిల్లలు

గుక్కపట్టి ఏడుస్తున్నాయ్

మీరు బ్రతికే ఉన్నారు

పాట తన ప్రాణం పోగొట్టుకుంది

మీరు ఎప్పటికి రాయని పాటలాగ

మేం మిగిలిపోయాం

- సుకుమార్’’ అని సుకుమార్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.