ఈ టీజర్‌ గురించి మీకు చెప్పాలి!

ABN , First Publish Date - 2022-01-23T08:07:45+05:30 IST

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

ఈ టీజర్‌ గురించి మీకు చెప్పాలి!

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. బి. మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మాతలు. శనివారం టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడి పాత్రలో కనిపించ నున్నారు. డాక్టర్‌ అలేఖ్యగా కృతి నటించింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకథే... ఈ చిత్రం. ‘‘ఓ దర్శకుడికీ, ఓ డాక్టర్‌కీ మధ్య జరిగే ప్రేమకథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల మధ్య ఏం జరిగిందన్నదే కథ. టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌.

Updated Date - 2022-01-23T08:07:45+05:30 IST