హీరోగా నా ఆకలి తీరలేదు: సుధాకర్ కోమాకుల

ABN , First Publish Date - 2021-11-11T00:26:24+05:30 IST

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో సుధాకర్ కోమాకుల. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా ‘క్రాక్’తోనూ పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన కార్తీకేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రంలో

హీరోగా నా ఆకలి తీరలేదు: సుధాకర్ కోమాకుల

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో సుధాకర్ కోమాకుల. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా ‘క్రాక్’తోనూ పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన కార్తీకేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రంలో ఏసీపీ పాత్రలో నటించారు. ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘నవంబర్ 12న నా పుట్టినరోజు. అదే రోజు ఈ సినిమా విడుదలవడం అనేది నాకు చాలా స్పెషల్ మూమెంట్. చిత్ర దర్శకుడు శ్రీ సరిపల్లి సుమారు పదేళ్ల నుండి తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకు పని చేశాడు. అక్కడ నన్ను రెండు మూడు సినిమాలకు ఆడిషన్ చేశాడు. కెరీర్ పరంగా చూసినా... నేను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చేసినప్పుడు అతను సహాయ దర్శకుడిగా వేరే సినిమాలకు పని చేసేవాడు. నా ‘నువ్వు తోపురా’ సినిమాకు చీఫ్ అసోసియేట్‌గా పని చేశాడు. అలా మా మధ్య పరిచయం మరింత బలపడింది. ఒకరోజు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పి.. నువ్వు ఓ రోల్ చేయాలి అన్నాడు. ‘నేను చేయను. హీరోగా సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పా. ‘చాలా మంచి రోల్. నీకు బాగుంటుంది’ అని అన్నాడు. నాకు ఆల్రెడీ రోల్ గురించి తెలుసు. హీరోగా సినిమాలు చేస్తూ మధ్యలో ‘క్రాక్’, ఈ ‘రాజా విక్రమార్క’ చేశా.


సినిమా పరంగా చెప్పాలంటే... నాది సినిమాలో కీలకమైన పాత్ర. గోవింద్ అనే ఏసీపీ రోల్. అతను హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూటిరీ ఆఫీసర్. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర గంభీరంగా ఉంటుంది. హీరో సహా మిగతా నటీనటులు అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. లుక్ బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. హీరోగా చేస్తూ... వేరే సినిమాల్లో రోల్స్ చేస్తున్నారని అంతా అడుగుతున్నారు. అసలు నేనెప్పుడూ హీరోగా చేయాలని అనుకోలేదు. మంచి పాత్రలు వస్తే చేద్దామని అనుకున్నాను. కానీ, నాకు రాలేదు. ఇందులో కుదిరింది. ప్రస్తుతం కార్తికేయ యంగెస్ట్ సెన్సేషన్. తనతో చేయడం నాకు హెల్ప్ అవుతుంది. ఎట్ సేమ్ టైమ్.. కాంబినేషన్ సీన్స్ చూడటం ప్రేక్షకులకు బాగుంటుంది. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ కూడా అలా చూడటం లేదు. కార్తికేయ కూడా తమిళ్ ‘వలిమై’లో విలన్ రోల్ చేశాడు. హీరోగా నా ఆకలి తీరలేదు. ఎక్కువ హీరో రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. మధ్యలో మంచి రోల్స్ వస్తే చేస్తాను. 


‘క్రాక్’లో కానిస్టేబుల్, ‘రాజా విక్రమార్క’లో ఏసీపీ... పోలీస్ అంటే సుధాకర్ కోమాకుల గుర్తుకు వస్తారేమో? అని అంటున్నారు. వాస్తవానికి ‘క్రాక్’ ముందు విడుదలైంది కానీ.. ‘రాజా విక్రమార్క’ చిత్రమే ముందు అంగీకరించాను. కానిస్టేబుల్, ఏసీపీ... రెండు డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ సినిమాల్లో పోలీస్ పాత్రలు కాదు. వేరే రోల్స్ అవి. దర్శకుడు శ్రీ సరిపల్లి పని రాక్షసుడు. ఈ పాత్రకు నేను అయితే బాగుంటుందని అతను తీసుకున్నాడు. నా స్నేహితుడు నన్ను బాగా చూపిస్తాడనే నమ్మకంతో ఈ సినిమా చేశా. సినిమా వరకూ మేమిద్దరం.. నటుడు, దర్శకుడు.. అంతే! నా కాస్ట్యూమ్స్, లుక్ పరంగా కేర్ తీసుకున్నాడు. మా నిర్మాత ‘88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి. టి సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడికి కావాల్సింది ఇచ్చి బాగా తీశారు. 


లాక్‌డౌన్‌లో మెగాస్టార్ చిరంజీవిగారి ‘ఇందువదన...’ కవర్ సాంగ్ గురించి చెప్పాలంటే.. లాక్‌డౌన్‌లో ఏదో ఒకటి కొత్తగా చేయాలని చేశా. మొత్తం అమెరికాలో షూటింగ్ చేశాం. అది చూసి చిరంజీవిగారు వాయిస్ మెసేజ్ పంపించారు. ‘ఇండియా వచ్చినప్పుడు కలుస్తాను సార్’ అని మెసేజ్ చేశా. సరేననన్నారు. ఇండియా వచ్చాక... ఈ ఏడాది న్యూ ఇయర్ మెసేజ్ చేశా. వెంటనే రిప్లయ్ ఇచ్చారు. నెక్స్ట్ డే మేనేజర్ కాల్ చేసి.. సండే అపాయింట్మెంట్ ఇచ్చారు. సాధారణంగా ఆయన ఆదివారం ఎవరినీ కలవరట. నా వైఫ్ అమెరికా వెళ్లిపోతుందేమోనని చిరంజీవిగారు కలిశారు. చాలా సంతోషం అనిపించింది. అదొక బ్యూటిఫుల్ మెమరీ. నా వైఫ్ హారిక చిన్నతనం నుంచి భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. తనకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ, తన ఫీల్డ్ ఇది కాదు. అందుకని, ఎప్పుడూ ఇటువైపు రాలేదు. సాంగ్ ఒక్కటి చేసింది.  


హీరోగా ప్రస్తుతం ‘నారాయణ అండ్ కో’ చేస్తున్నాను. అందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. హీరోగా ‘జీడీ’ (గుండెల్లో దమ్ముంటే) అని మరో సినిమా చేస్తున్నాను. ఆర్మీకి వెళ్లాలని అనుకునే ఫ్ర‌స్టేటెడ్ యంగ్‌స్ట‌ర్‌ రోల్. ఆ కథ ఒక్క రాత్రిలో జరుగుతుంది. మరో సినిమా కూడా ఓకే అయ్యింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-11-11T00:26:24+05:30 IST