‘ఆకాశం నీ హద్దురా ’ రీమేక్ అనంతరం.. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లతో సినిమాలకు ప్రణాళికలు : సుధా కొంగర

ABN , First Publish Date - 2022-01-15T21:44:27+05:30 IST

‘ గురు ’, ‘ ఆకాశం నీ హద్దురా ’ సినిమాలతో దక్షిణాది ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకురాలు సుధా కొంగర. ‘ఆకాశం నీ హద్దురా ’

‘ఆకాశం నీ హద్దురా ’ రీమేక్ అనంతరం.. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లతో  సినిమాలకు ప్రణాళికలు : సుధా కొంగర

‘ గురు ’, ‘ ఆకాశం నీ హద్దురా ’ సినిమాలతో దక్షిణాది ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకురాలు సుధా కొంగర. ‘ఆకాశం నీ హద్దురా ’ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దీంతో ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. గతేడాది జులైలో ఆ రీమేక్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది. ఆ రీమేక్‌కు కూడా సుధనే దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ ‘‘ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ’’ ఆ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తుంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూకు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


‘‘ సినిమాలకు భాషతో సంబంధం లేదు. సరిహద్దులు తొలగిపోతున్నాయి. ఓటీటీలు ప్రపంచాన్ని ఏకం చేశాయి. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని థియేటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించాం. కానీ, కరోనా రావడంతో ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశాం. ఆ చిత్రం రిలీజ్ కాగానే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. హిందీ రీమేక్‌కు భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందిన యాస ఉపయోగించాలని ఆలోచిస్తున్నాం. స్క్రిఫ్ట్‌ రెడీ కావాలి. అప్పుడే నటుడిని సంప్రదిస్తాం. దక్షిణాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘ ఆకాశం నీ హద్దురా ’ సినిమాను రూపొందించాం. బాలీవుడ్ ప్రేకకులకు అనుగుణంగా దానిని మార్చాలి. ఆ సినిమా పాన్ ఇండియా స్టోరీ ’’ అని సుధా కొంగర చెప్పారు.  


ఆ రీమేక్ అనంతరం మహేశ్ బాబు, అల్లు అర్జున్, హృతిక్ రోషన్‌లతో సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఆమె వివరించారు. రిటైర్డ్ ఆర్మీ కెఫ్టెన్ జీఆర్. గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆకాశం నీ హద్దురా ’ సినిమాను తెరకెక్కించారు. ఎయిర్ డెక్కన్ అనే చౌక విమానయాన సంస్థను ఆయన స్థాపించారు. 

Updated Date - 2022-01-15T21:44:27+05:30 IST