Suchi Leaks: అప్పట్లో హీరో ధనుష్ తనతో బలవంతంగా శృంగారం చేశాడన్న సింగర్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..

Twitter IconWatsapp IconFacebook Icon
Suchi Leaks: అప్పట్లో హీరో ధనుష్ తనతో బలవంతంగా శృంగారం చేశాడన్న సింగర్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..

కోలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగాడు. అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్‌ని 2004లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇటీవలే ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ స్టార్ హీరో ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. కానీ.. అలాంటి వివాదాలపైనా చాలా జాగ్రత్తగా స్పందిస్తూ ఉంటాడు. కానీ.. 2017లో ప్రముఖ గాయని సుచిత్ర కార్తీక్ చేసిన వ్యాఖ్యలు ధనుష్‌ని కొంచెం ఇబ్బంది పెట్టింది.


మొదట ఆర్‌జే‌గా పని చేసి తర్వాత గాయనిగా మారింది సుచిత్ర కార్తీక్. మంచి అవకాశాలు అందుకుంటూ సింగర్‌గా పాపులారిటీ సాధించింది. అనంతరం ఏమైందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విచిత్ర సంబంధాల గురించి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అలా ధనుష్‌తో కలిసి తాను బెడ్‌పై ఉన్న పిక్స్‌ని సోషల్ మీడియాల్ షేర్ చేసింది. దానికి.. ‘ధనుష్, అనిరుధ్, చిన్మయికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు దీన్ని ట్రోల్ చేస్తారని, తిరస్కరిస్తారని నాకు తెలుసు. ఈ చవకబారు చర్య గురించి మాట్లాడే దమ్ము మీకు ఉందా?. నేను ధనుష్, అనిరుధ్ వారం క్రితం ఓ పార్టీలో కలిశాం. అందరం తాగాం. అయితే ఆ సందర్భంలో నాకు ఇచ్చిన డ్రింక్‌లో ఏదో కలిపి ఇచ్చారు. దీంతో నేను మత్తులోకి వెళ్లాను. ఈ ఇద్దరూ నాతో శృంగారం చేసి నన్ను మంచం మీద వదిలేశారు. వారి ఫోన్ల నుంచి పిక్స్ తీసుకుని ఇక్కడ పోస్టు చేస్తున్నాను. అప్పుడు జరిగిన భయంకరమైన అనుభవం గురించి ఇక్కడ చెప్పలేను’ అని రాసుకొచ్చింది. ఆ పిక్స్ కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా దేశం మొత్తాన్ని షేక్ చేశాయి. అయితే.. కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసినప్పటికీ పలు స్క్రీన్ షాట్స్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.


దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌ని అడగగా యాంకర్‌పై కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. దాని గురించి నాకు సరైన ఆలోచన లేదు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను. అలాంటి వాటిపైన దృష్టి పెట్టను. నేను మానసిక వేదన అనుభవించానని ఎవరు చెప్పారు? నేను ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పానా? నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత విషయాలను నాకు వెల్లడిస్తారా?. గోప్యత ఉంటుంది కదా.. నేను మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదో చెత్త ఇంటర్వ్యూ’ అని అరుస్తూ ధనుష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Suchi Leaks: అప్పట్లో హీరో ధనుష్ తనతో బలవంతంగా శృంగారం చేశాడన్న సింగర్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.