స్టయిలిష్‌ శేఖర్‌

రాజశేఖర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్‌’. హీరోగా ఆయనకు ఇది 91వ చిత్రం. ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. గత సినిమాలకు భిన్నంగా స్టైయిలిష్‌ లుక్‌లో రాజశేఖర్‌ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాసం బొగ్గరం నిర్మిస్తున్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.