కూతురికి `రాధ` అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పిన Shriya Saran!

తెలుగు, తమిళ భాషల సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రియా శరణ్. ఇప్పటికీ ఆమె సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కోస్చీవ్‌ను వివాహం చేసుకున్న శ్రియ ఓ చిన్నారికి తల్లి అయింది. డెలివరీ అయ్యే వరకు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రహస్యంగా ఉంచి ఒక్కసారిగా శ్రియ అందరికీ షాకిచ్చింది. అంతేకాదు తన కూతురికి `రాధ` అని పేరు పెట్టి మరింత షాకిచ్చింది. 


తన కూతురికి రష్యన్ సాంప్రదాయం ప్రకారం కాకుండా హిందూ మతానికి చెందిన పేరు పెట్టింది. తన కూతురికి `రాధ` అనే పేరు పెట్టడం వెనుక గల కారణాన్ని శ్రియ తాజాగా వెల్లడించింది. `నాకు ప్రసవం అయిన తర్వాత మా అమ్మకి ఫోన్ చేశాను. నాకు ఆడపిల్ల పుట్టిందనే విషయం తెలుసుకున్న అమ్మ.. `అయితే రాధా రాణి వచ్చేసిందన్న మాట` అని యథాలాపంగా అంది. ఆ మాటలు విన్న ఆండ్రీ.. `ఆమె రష్యన్ భాషలో ఏమి చెప్పింది` అని అడిగాడు. దానికి నేను.. `ఆమె రష్యన్ మాట్లాడలేదు.. మన పాపను రాధా రాణి అని పిలిచింద`ని చెప్పాను. దాంతో `రష్యన్ భాషలో `రాధ` అంటే సంతోషం అనే అర్థముంద`ని ఆండ్రీ చెప్పాడు. దాంతో పాపకు ఆ పేరు పెట్టామ`ని శ్రియ చెప్పింది. ఇవి కూడా చదవండిImage Caption

Very sad: అర్ధరాత్రి ఇంటికొచ్చిన కూతురు.. ఇంతసేపు ఎక్కడికెళ్లావంటూ నిలదీసిన తండ్రి.. ఆమె చెప్పింది విని..పుట్టబోయే బేబీ పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తున్న రణ్ వీర్ సింగ్.. రోటీ మేకర్ ఫొటోతో భర్తను ట్రోలింగ్ చేస్తున్న దీపికా పదుకొణె

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.