‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ విడుదలకు రెడీ

ABN , First Publish Date - 2021-07-08T23:41:12+05:30 IST

‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు... మనల్ని కాపాడేందుకు అనుక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఎన్‌ఎస్‌జీ కమాండోలకు నివాళి ఇది. నౌకాదళ అధికారి కుమారుడిగా నేను సైనిక దళాల శక్తియుక్తులను

‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ విడుదలకు రెడీ

26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: 26/11' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌' ఫ్రాంచైజీలో రెండో సీజన్ 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్‌ అటాక్‌'ను ఒరిజినల్ మూవీగా 'జీ 5' ఓటీటీ అందించబోతోంది. ఈ చిత్రం జూలై 9న హిందీ, తమిళ్‌, తెలుగు భాషలలో ఏకకాలంలో 'జీ 5' ఓటీటీలో విడుదలకాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా కీలక పాత్రలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన యూనిఫామ్‌లో కనిపిస్తుండటం విశేషం. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: 26/11'లో ఎన్‌ఎస్‌జీ కమాండోగా నటించిన వివేక్‌ దహియాను ఈ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు గౌతమ్‌ రోడె, సమీర్‌ సోని, పర్వీన్‌ దబాస్‌, మంజరి ఫడ్నవీస్‌ ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా నటించారు. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: 26/11' రూపొందించిన కాంటిలో పిక్చర్స్‌ (అభిమన్యు సింగ్‌) ఈ చిత్రానికి నిర్మాత. 'అభయ్‌ 2'కు దర్శకత్వం వహించిన కెన్‌ ఘోష్‌ దీనికి దర్శకుడు. కర్నల్‌ (రిటైర్డ్‌) సందీప్‌ సేన్‌ (26/11 భయానక ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకి సెకండ్‌ ఇన్‌ కమాండ్‌) ఈ స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.


వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌' మన భారత సైనికులకు నివాళి. భారతీయుల ధైర్యానికి వందనం ఇది. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌' ఫ్రాంచైజీలో మరిన్ని చిత్రాలు రానున్నాయని 'జీ 5' వర్గాలు తెలిపాయి. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఉగ్రవాదులను ధైర్యంగా బంధించేందుకు/మట్టుబెట్టేందుకు ఎన్‌ఎస్‌జీ సదా తన సంకల్పాన్ని, సంసిద్ధతను ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఆలయంపై జరిగిన భయానక దాడి ఘటనల వెనుకున్న యాక్షన్‌ దృశ్యాలను ఈ చిత్రం మీ ముందు ఉంచుతుంది. థ్రిల్‌, యాక్షన్‌, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రం వీక్షకులను మునివేళ్లపై నిలబెడుతుందని 'జీ 5' వర్గాలు తెలుపగా.. '' 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్'‌, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు... మనల్ని కాపాడేందుకు అనుక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఎన్‌ఎస్‌జీ కమాండోలకు నివాళి ఇది. నౌకాదళ అధికారి కుమారుడిగా నేను సైనిక దళాల శక్తియుక్తులను చూస్తూ పెరిగాను. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌'లో మన హీరోలకు నివాళి అర్పించేందుకు మా వంతు కృషి మేము చేశాం.‌ 'జీ 5'లో జూలై 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది..” అని దర్శకుడు కెన్‌ ఘోష్‌ తెలిపారు.



Updated Date - 2021-07-08T23:41:12+05:30 IST