మళ్లీ మొదలుపెడుతున్నారు

ABN , First Publish Date - 2021-09-07T06:49:37+05:30 IST

ఫుట్‌బాల్‌ కోచ్‌గా, మేనేజర్‌గా అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రం షూటింగ్‌ మళ్లీ మొదలుకానుంది. కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది....

మళ్లీ మొదలుపెడుతున్నారు

ఫుట్‌బాల్‌ కోచ్‌గా, మేనేజర్‌గా అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రం షూటింగ్‌ మళ్లీ మొదలుకానుంది. కరోనా  కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది.  మే నెల్లో మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టాలనుకొనేంతలో తుపాన్‌ వచ్చి ఈ సినిమా కోసం వేసిన స్టేడియం సెట్‌ కొట్టుకుపోయింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అక్టోబర్‌ నెల్లో షూటింగ్‌ ప్రారంభించి, ఏకధాటిగా 25 రోజుల పాటు వర్క్‌ చేసి చిత్రాన్ని పూర్తి చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ముందుగా స్టేడియం సెట్‌ను తిరిగి వేయడానికి  పనులు త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే సినిమాకు కీలకమైన జకర్తాలో 1962లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ సీన్‌ను ఇందులో చిత్రీకరిస్తారు.  


1950-60ల మధ్య  కాలంలో ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కు కోచ్‌గా, మేనేజర్‌గా పనిచేసిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్‌’ చిత్రాన్ని అమిత్‌ ఆర్‌ శర్మ రూపొందిస్తున్నారు.

Updated Date - 2021-09-07T06:49:37+05:30 IST